EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోర్సులో  చేరేందుకు అక్టోబర్ 13 గడవు 

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 4 :

________________________________

డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి బిఏ, బికాం, బిఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, బిఎల్ ఐసి, ఎంఎల్ ఐసి డిప్లొమా అడ్మిషన్ల గడువును అక్టోబర్ 13 వరకు పొడిగిస్తున్నట్లు విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ (LSSB) డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీలో కొత్త పిజీ కోర్సులు ఎంఏ (ఎడ్యుకేషన్), ఎంఏ ఎడ్యుకేషన్ ( స్కూల్ అడ్మినిస్ట్రేషన్), ఎంఎస్ డబ్ల్యూ ( మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్), ఎమ్మెస్సీ, జాగ్రఫీ, ఎమ్మెస్సీ, కంప్యూటర్ సైన్స్ ఎమ్మెస్సీ, స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ, డేటా సైన్స్ కోర్సులు ప్రవేశపెటుతున్నట్లు తెలిపారు. అదే విధంగా ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ, పిజీ ఆన్ లైన్ కోర్పులు బీకాం తెలుగు మీడియం, బీకాం ఇంగ్లీష్ మీడియం, ఎంఏ తెలుగు, ఎంకామ్, ఎంబిఏ కోర్సలకు ఆన్ లైన్ లో అడ్మిషన్లు పొందవచ్చాన్నారు. మరిన్ని వివరాలకోసం www.braouonline.in, admission registration వెబ్‌ సైట్‌లో login అయి దరఖాస్తు చేసుకున్న తరువాత అభ్యర్థులు ఎంచుకున్న స్టడీ సెంటర్‌లో సంప్రదించాలన్నారు.

Related News

Select the Topic
Scroll to Top