ఈతరం భారతం ఖమ్మం, అక్టోబర్ 04:రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్,మధుశ్రీ నలుబోల.
_______________________________________________________________
వికాస వేదిక సాహిత్య సంస్థ, ఖమ్మం ఆధ్వర్యంలో ఆదివారం రోజు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్‌లో ప్రముఖ రచయిత డాక్టర్ కాసర్ల రంగారావు రచించిన నాలుగు పుస్తకాల పరిచయ కార్యక్రమం, కళాకారుల సన్మానం మరియు కవి సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస వేదిక సాహిత్య సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సాధనాల వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ భాష, సాహిత్యాలు సమాజ పురోగతికి మూలస్తంభాలని, అక్షర సాధన ద్వారానే సమాజంలో చైతన్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సాహిత్యం గొప్పదనం గురించి అతిధులు వికాస వేదిక సాహిత్య సంస్థ ప్రతినిధులు, గొప్పగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి బుక్కా సత్యనారాయణ అధ్యక్షత వహించగా,
కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కాసర్ల రంగారావు కలం నుండి జాలువారిన “భాషాంజలి” (నానేలు పరిచయం – మువ్వా శ్రీనివాసరావు, సాధనాల వెంకటస్వామినాయుడు), “తెలుగు వెలుగులు” (పరిచయం – డాక్టర్ అమ్మిశెట్టి శ్రీనివాసరాజు/అమ్మిన శ్రీనివాసరాజు), “అక్షర శిల్పాలు” (పరిచయం – యన్. తీర్థల్), “ఊర్వశితో సంభాషణలు” (పరిచయం – అవధానం రఘుకుమార్) అను 4 పుస్తకాలను ఆవిష్కరించి పరిచయం చేశారు.అలాగే ఖమ్మం జిల్లా కళాకారుల సంఘం ఎన్నికల్లో నూతనంగా అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన పొగి వెంకన్న, బొమ్మెర ముత్యంలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనానికి కోలారాములు, మలిశెట్టి కృష్ణమూర్తి, ఎస్ కె మోహినొద్దీన్, నలుబోల మధుశ్రీ, మందుల వీరభద్రం, వి. నరసింహారావు, రెంటాల చిన్న హుస్సేన్, శోభనాద్రి, హాలావత్ సీత్లా నాయక్, బి. నాగేశ్వరరావు, బి. సుశీరా, యస్.కె. మోహిద్దీన్, చింతమళ్ళ సునీత, కె. వసంత, కొత్తపల్లి కృష్ణారావు, కొంపెల్లి రామయ్య, అంగోతు జయవాసు, యం. వీర వెంకటరెడ్డి అధ్యక్షత వహించి కవితాగానం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యాతిథులుగా డాక్టర్ కాసర్ల రంగారావు, ఎన్. కాంతేశ్వరరావు, జి. లెనిన్ శ్రీనివాస్, యడవల్లి శైలజశ్రీనివాస్, తోటపల్లి సృజన్ కుమార్, గాజుల భారతిశ్రీనివాస్, తిరునగరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను డి. శ్రీకాంత్, సిహెచ్. వీరబాబు, పి. రమేష్ బాబు, రేళ్ళ శ్రీనివాస్, గోవింద్ విజయవంతంగా నిర్వహించారు.















