ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 22
________________________________
అరెస్టు చేసే సమయంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నిందితుడికి అర్థమయ్యే భాషలో రాతపూర్వకంగా తెలియజేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం, తన అరెస్టుకు గల కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి వ్యక్తికీ ఉందని పేర్కొంది. ఈ నిబంధనలను పాటించకుండా చేసిన అరెస్టును చట్టవిరుద్ధమైనదిగా పరిగణించి, సంబంధిత వ్యక్తిని వెంటనే విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపింది.అలాగే, నిబంధనలను ఉల్లంఘించే పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించింది.















