EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆ ‘ఏడు’ యాప్స్‌ను వెంటనే తొలగించండి.. గూగుల్, ఆపిల్‌కు కేంద్రం నోటీసులు 

ఈతరం భారతం న్యూఢిల్లీ జూలై 3

సాంకేతిక దిగ్గజ సంస్థలైన గూగుల్, ఆపిల్‌ కు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ నోటీసులు పంపింది. ఎలక్రానిక్ రిక్షాలు, వాహనాలకు సమస్యలు తెస్తూ.. వాటి పాలిట విలన్‌లా మారిన ‘ఏడు’ యాప్స్‌ను వెంటనే తొలగించాలని ఈ రెండు సంస్థలను కోరింది. ఈ-రిక్షాలు, ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీల పనితీరును దెబ్బతీస్తున్న ఈ యాప్స్‌ను తమ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ స్టోర్‌ నుంచి తీసేయాలని గూగుల్, యాపిల్‌ కంపెనీలకు విజ్ఞప్తి చేసింది. ఈవీ రిక్షాలు, ఈవీ వాహనాల బ్యాటరీలను అకస్మాత్తుగా ఆగిపోయేలా చేస్తున్న BAT-BMS, SMART BMS, LOSSIGY వంటి ఏడు యాప్స్‌ను వెంటనే తొలగించాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటువంటి యాప్స్ సాయంతో ఈవీ వాహనదారుల ప్రమేయం, అనుమతి లేకుండానే వాహనాలను నిలిపివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన ప్రభుత్వం.. తక్షణమే వీటిని తమ యాప్స్ స్టోర్, ఐఓఎస్ నుంచి తొలగించాలని కోరింది.

Related News

Select the Topic
Scroll to Top