ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 11
_____________________________
చాట్‌జీపీటీ సాయంతో సొంతంగా ప్రిపేర్ అయి హర్యానా సివిల్ సర్వీసెస్‌లో ఐదో ర్యాంకు సాధించింది. హిసార్‌కు చెందిన ఛావి 675 మార్కులకు 385.80 మార్కులు సాధించింది.
బీఏ ఎల్‌ఎల్‌బీ చదువుతూనే సివిల్స్‌కు సిద్ధమైన ఆమె.. రోజుకు 8 గంటలు చదువుతూ, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. తన సందేహాలను చాట్‌జీపీటీ ద్వారా నివృత్తి చేసుకుంది.దాదాపు 60 వేల మంది పరీక్షకు హాజరుకాగా, ఛావి ఐదో ర్యాంకు సాధించి తన కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం పొందిన తొలి వ్యక్తిగా నిలిచింది















