EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా బ్రిలియన్స్ ఏ ఐ ప్రారంభం

ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 11:

_________________________________

;హైదరాబాద్‌లో రూపొందిన విద్యాసంస్థల ఏ ఐ సాఫ్ట్‌వేర్ సూట్ ను బంజారాహిల్స్ లో బ్రిలియన్స్ ఏ ఐ ను మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విద్యా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందన్నారు.

ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మరింత మెరుగుపరుస్తాయన్నారు.విద్యార్థులు ప్రాక్టీస్, లెర్నింగ్ కోసం ఎడ్యుకేషన్ టెక్నాలజీని వినియోగించుకోవడం సంతోషకరమన్నారు.

నీట్ పేపర్ లీక్ తర్వాత .. డేటా లీక్ అరికట్టాల్సిన అవసరం మరింత పెరిగింది

ఎడ్యుటెక్ 2025 సర్వే ప్రకారం.. ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పిల్లల్లో 77 శాతం మంది ప్రాక్టీస్, లెర్నింగ్ కోసం వినియోగిస్తున్నారు.సంప్రదాయ విద్యా విధానాలకు సాంకేతికతను జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.విద్యా సంస్థల్లో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి రావాలన్నారు.

డిజిటల్ వ్యవస్థల భద్రత, డేటా విశ్లేషణలో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. డేటా రక్షణ, గోప్యతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.డేటా గోప్యతను కాపాడటం, డిజిటల్ వ్యవస్థలను సురక్షితంగా ఉంచడం అత్యంత ముఖ్యం.డేటా సెంటర్ల ఏర్పాటులో డేటా భద్రత, గోప్యత కీలక అంశాలని,  ఏ ఐ

సాధనాలను ఉపయోగించేటప్పుడు అవి ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తున్నాయో పరిశీలించాలన్నారు.

ఏఐ వినియోగంలో బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యం.సాంకేతికతను ఉపయోగించుకోవడంతోపాటు దాని ద్వారా ఎదురయ్యే సవాళ్లపైనా దృష్టి పెట్టాలన్నారు.

విద్యార్థులకు ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను ప్రోత్సహించాలి.డిజిటల్ భద్రతకు ప్రాధాన్యమిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి.విద్యా కార్యకలాపాల్లో కృత్రిమ మేధస్సు వినియోగానికి ప్రోత్సాహనిస్తుందన్నారు.ప్రశ్నాపత్రాల తయారీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం వరకు AI సేవలువిద్యార్థుల సందేహాల నివృత్తికి టెక్స్ట్, వాయిస్ ఆధారిత సదుపాయమని,విద్యార్థుల అకడమిక్ పురోగతిపై తల్లిదండ్రులకు నివేదికలు అందించే సాంకేతికత అని అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top