EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎలాన్ మ‌స్క్‌కు క‌మ‌ల్ హాస‌న్ కౌంట‌ర్..!

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 11:

_________________________________

భార‌త‌దేశానికి ప్ర‌ధాని  అంబానీ  నా అంటూ టెస్లా , స్పేస్‌ఎక్స్  సంస్థ‌ల‌ అధినేత ఎలాన్ మస్క్  చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు, రాజ్యసభ స‌భ్యుడు కమల్ హాసన్  స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. దేశ విధానాలను ఏ బిలియనీర్  నిర్దేశించలేరని వ్యాఖ్యానించారు. కమల్ హాస‌న్ కౌంట‌ర్‌కు నటి, ఎంపీ కంగనా రనౌత్  కూడా మద్దతు తెలిపారు.

భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు లైసెన్సింగ్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో స్పందించారు. భారత ప్రధాని అంబానీనా..? అంటూ సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. దీనిపై కమల్ హాసన్ దీటుగా బదులిచ్చారు. ఏ బిలియనీర్ అయినా, అది భారతీయుడైనా అమెరికన్ అయినా.. దేశ విధానాలను నిర్దేశించలేరని వ్యాఖ్యానించారు. ప్రతి దేశం తన సొంత ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.

స్వేచ్ఛా వాణిజ్యం గురించి చెప్పే పశ్చిమ దేశాలు రక్షణాత్మక విధానాలు పాటిస్తున్నాయని కమల్ హాస‌న్‌ విమర్శించారు. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై అమెరికా 100 శాతం సుంకాలు విధించి తన దేశీయ పరిశ్రమను కాపాడుకుంటోందని అన్నారు. భారత్ కూడా అదేవిధంగా తన దేశీయ తయారీ రంగాన్ని పరిరక్షించుకోవడానికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశమ‌ని, వలసపాలిత ప్రాంతం (కాలనీ) కాదని వ్యాఖ్యానించారు.

తాము ప్రపంచాన్ని స్వాగతిస్తామ‌ని, కానీ భార‌త ప్ర‌జ‌లుగా మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకుంటామ‌ని కమల్ హాసన్ తన పోస్టులో స్ప‌ష్టంచేశారు. కమల్ పోస్టును షేర్‌ చేస్తూ కంగనా రనౌత్ స్పందించారు. క‌మ‌ల్ కౌంట‌ర్‌ మస్క్‌కు బాగా తగిలి ఉంటుందని కంగ‌నా త‌న పోస్టులో పేర్కొన్నారు. ఏ బిలియనీర్ దేశ విధానాలను నిర్దేశించకూడదని కమల్ చాలా స్పష్టంగా, వ్యంగ్యంగా, సూటిగా చెప్పారని ప్రశంసించారు. ఇప్పటికే మస్క్ ఆరోపణలను భారత కమ్యూనికేషన్ల శాఖ నిరాధారమైనవని కొట్టిపారేసింది.

Related News

Select the Topic
Scroll to Top