ఈతరం భారతం ముంబై జూలై 3
పౌరులు ప్రభుత్వ బానిసలు కాదు, ఏదైనా సమస్యపై నిరసనలకు దిగితే వారిపై బహిష్కరణకు దిగుతారా? అని బొంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ వ్యక్తి అయినా నిరసనలు, ఉద్యమాల్లో పాల్గొంటే ఆంక్షలకు దిగే అధికారం ప్రభుత్వాలకు లేదని శుక్రవారం హైకోర్టు ఓ కేసు విచారణ దిశలో ఘాటైన రూలింగ్ వెలువరించింది. ముంబైలో స్థానిక రాజకీయ నాయకుడు పయీద్ అహ్మద్ వహీద్ చౌదరికి నగర బహిష్కరణ విధించింది. నిరసనల్లో తాను కేంద్రానికి, హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలకు దిగానని, దీనిని తీవ్రంగా పరిగణించి తనపై బహిష్కరణ విధించారని, ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని వహీద్ చౌదరి ముంబై హైకోర్టును ఆశ్రయించారు.కేవలం నినాదాలకు దిగితే వెలివేస్తారా? ప్రజలు ప్రభుత్వాలకు జీ హుజుర్లు కొట్టే సేవకులు కాదు, పల్లకిలు మోసే బోయీలు కాదని పేర్కొన్న ముంబై హైకోర్టు బహిష్కరణ ఆదేశాలను కొట్టివేసింది.















