EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గంభీరమైన యోధుడి వేషధారణలో అర్జున్ సర్జా’ విరావి ‘

ఈతరం భారతం వినోదం:

‘మా ఊరి పొలిమేర’ సినిమా  కరోనా కాలంలో నేరుగా ఓటీటీలో విడుదలై ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. ఆ తర్వాత థియేటర్లలో రిలీజైన ‘మా ఊరి పొలిమేర 2’ కూడా అంచనాలకు మించి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో మూడో పార్ట్ రానుంది. తాజాగా పొలిమేర 3 సినిమా నుంచి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు.ఈ చీకటి ప్రపంచంలోకి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాను దించుతూ ఆయన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో అర్జున్ ‘వీరావి’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు ఇదే పాత్రకు సంబంధించిన ఎపిక్ థీమ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఫ్రమ్ రేజ్ టు రోర్’ అంటూ సాగే ఈ గ్లింప్స్ ఆడియెన్స్ ను భయపెడుతోంది. అమావాస్య వాతావరణం, పాడుబడిన ఆలయంలోని చీకటి ప్రదేశాలు, విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలతో పాటు అనంత పద్మనాభస్వామి దర్శనంతో సాగే గ్లింప్స్ ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అలాగే సత్యం రాజేష్ నగ్నంగా పూజలు చేయడం, మరోవైపు చేతిలో పదునైన కత్తి పట్టుకుని, గంభీరమైన యోధుడి వేషధారణలో అర్జున్ సర్జా ‘విరావి’ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించిన తీరు సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీని పెంచేశాయి.కాగా మొదటి రెండు సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో మరిన్ని హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీనికి తోడు ఈసారి అర్జున్ సర్జా వంటి యాక్షన్ హీరో ను కూడా రంగంలోకి దించారు. కాగా వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, భరత్ నారంగ్ సంయుక్తంగా పొలిమేర 3 సినిమాను నిర్మిస్తున్నారు. గత రెండు సినిమాల్లో ఉన్న సత్యం రాజేష్, బాలాదిత్య, సాయి కామాక్షి భాస్కర్ల.. పలువురు ఈ పార్ట్ 3 లో కూడా ఉండనున్నారు.ఈ సారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Related News

Select the Topic
Scroll to Top