EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణలో జనాభా లెక్కలు వచ్చే ఏడాది జనవరి 25 నుంచి…

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 9:

తెలంగాణలో జనగణన–2027 షెడ్యూల్ ఖరారు అయింది. తెలంగాణలో 2027 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా గణన జరగనుంది. జనవరి 10 నుంచి 24 వరకు స్వీయ జనగణనకు అవకాశం కల్పించనున్నారు. మార్చి 1 నుంచి 5 వరకు రివిజనల్ రౌండ్ నిర్వహణ జరగనుండగా.. 2027 మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలను జనగణనకు ప్రామాణిక తేదీగా నిర్ణయించారు. జనగణన తేదీలపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం పున ప్రచురణ చేసింది. జీఓ నంబర్ 155 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. అక్టోబర్ 30న కేంద్ర ప్రభుత్వం 2027 జనగణనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయగా.. దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జనవరి 25 నుంచి ఇంటింటి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. ఈ తేదీల మధ్య సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శించి కుటుంబాల, వ్యక్తుల వివరాలను నమోదు చేసుకుంటారు.ఈసారి జనగణనలో ప్రజలకు ముఖ్యమైన అవకాశం కల్పించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానంలో ప్రజలే స్వయంగా ఆన్లైన్ ద్వారా తమ వివరాలు అందించవచ్చు. ఈ ప్రక్రియ జనవరి 10, 2027న ప్రారంభమై జనవరి 24, 2027 వరకు కొనసాగనుంది. పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్ లేదా ఇతర మార్గాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. జనగణన ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక మార్చి 1, 2027 నుండి మార్చి 5, 2027 వరకు సవరణ కార్యక్రమం ఉంటుంది. అంటే డేటాలో ఏవైనా లోపాలు లేదా మార్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు. జనగణనకు ప్రామాణిక సమయంగా మార్చి 1, 2027 అర్ధరాత్రి 12:00 గంటలను ప్రభుత్వం నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయానికి రాష్ట్రంలో నివసిస్తున్న జనాభాను పరిగణనలోకి తీసుకుని గణాంకాలను సేకరిస్తారు.

Related News

Select the Topic
Scroll to Top