ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 9:
_________________________________
ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో సింగూరు, మంజీరా జలవనరుల్లో నీటి మట్టాలు క్రమంగా తగ్గుతున్న దృష్ట్యా, హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జలమండలి ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా నగరానికి రోజుకు అదనంగా 40 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) గోదావరి జలాలను తరలించేందుకు ఘన్పూర్ వద్ద చేపడుతున్న పైప్లైన్ అనుసంధాన పనులను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో సింగూరు–మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న దృష్ట్యా హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ 15వ తేదీలోగా పైప్లైన్ అనుసంధాన పనులు పూర్తి చేసి, గోదావరి జలాలను సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువును ఒక్కరోజు కూడా పొడిగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.














