ఈ తరం భారతం/ భద్రాద్రి కొత్తగూడెం /అక్టోబర్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల రోడ్లు అధ్వాన్న పరిస్థితిలో ఉన్నాయని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ చైర్మన్ డా,, సీహెచ్ విజయ మోహనరావు పేర్కొన్నారు. నేషనల్ ఎస్ టీ రైట్స్ చీఫ్ దిలీప్ కుమారుడు అధ్యక్షతన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థ సమావేశం జరిగింది.ఈ సమావేశం లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసామాన్యులు, రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు పడుతున్న అగచాట్లు,ఏజెన్సీ ప్రాంతములో బ్రతుకుతున్న గిరిజనులు, దళితులు, ఆయా సామాజిక వర్గం ప్రజలు తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రయాణములు అగచాట్లు అంతా ఇంత కాదన్నారు.రోడ్లు పెద్ద పెద్ద గుంతలు కలిగి తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసారు.వైద్యం కోసం, ఉద్యోగం, ఇంటర్వ్యూ, పాఠశాలలకు, కళాశాలలకు సమయానికి వెళ్లలేక సతమతమౌతున్న ప్రజల కష్టములు అంతా ఇంత కాదని, దీనికి తోడు వరదలు, గోదావరి ముంపు వలన తీవ్రమైన కష్టములు, ప్రతి రోజు ఇసుక లారీలు సుమారు 400 నుండి 500 అధిక లోడ్ తో నడవటం వలన రోడ్లు తీవ్రముగా దెబ్బతిని, ప్రజలు పడుతున్న కష్టములు భగవంతునికి ముడుతున్నాయని అన్నారు.ప్రభుత్వం, రోడ్లు రవాణా మంత్రిత్వ శాఖలు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. గోదావరి ముంపునకు, వర్షానికి తూరుబాక బ్రిడ్జి వద్ద రిపేర్ వలన వాహనాలు సైడ్ రోడ్ కు దిగి వెళ్తుంటే కూరుకు పోవుట వలన ములకపాడు నుండి ప్రయాణించి భద్రాచలం వెళ్ళటానికి సుమారు 3, 4 గంటల సమయం పడుతుంది. ప్రజలు పడుతున్న కష్టములు ప్రభుత్వం గ్రహించి తగిన మరమ్మతులు చేయవలసినదిగా ఇంటర్నేషనల్ హ్యూమెన్ రైట్స్ కోరుతుందన్నారు. చీఫ్ అడ్వైసర్, వైస్ ప్రసిడెంట్ యేసుజీవం, డిస్ట్రిక్ట్ కోర్డినేటర్స్ పెద్దపుడి కనకరాజు, జి చిరంజీవి, ప్రసిడెంట్ కొట్ర బాబురావు, సెక్రెటరీ తన్నీరు, కృష్ణ, జాయింట్ సెక్రెటరీ తెల్లం శ్రీనివాసు, ట్రేస్రీర్ మేకల, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.















