ఈతరం భారతం హైదరాబాద్ : జూలై 30
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ బేగంపేట్ ప్రిన్సిపాల్ డా. కె పద్మావతి తమ కాలేజీలో అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటి స్టడీ సెంటర్ లో డిగ్రీ అడ్మిషన్లు ప్రక్రియ కొనసాగుతున్నదని గురువారం తెలిపారు. వివిధ డిగ్రీ కోర్సుల అడ్మిషన్లకు ఇంటెర్మీడియట్ పూర్తయిన లేక open ఇంటర్ లేదా పాలీటెక్నిక్ మూడు సంవత్సరాల కోర్సు పూర్తయిన లేక ఐ .టి. ఐ . కోర్సు పూర్తి చేసిన వారు అడ్మిషన్లు పొందేందుకు అర్హులని ఆమె చెప్పారు. దూరవిద్య(Distance Education) ద్వారా చదువుకోవాలనుకునే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar Open University) డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడినందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. 2026-2027 అండర్ గ్రాడ్యుయేట్(Under Graduate) ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను నోటిఫికేషన్ లో చూసి తెలుసుకోవాలని ఆమె కోరారు. డిగ్రీలో బీఏ(BA), బీకాం(BCom), బీఎస్సీ(B.sc)
Note : M.A. (Economics, History, Political Science,
Public Administration, Sociology, Telugu, English,
Hindi, Urdu Programmes are offered for Only ఉమెన్స్… కోర్సుల్లో ప్రవేశాలకు, అలాగే అంతకు ముందు విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందిన వారు.. 2nd year & 3rd year ట్యూషన్ ఫీజును, అంతకుముందు చేరిన విద్యార్థుల్లో సకాలంలో చెల్లించలేకపోయిన వారు కూడా చెల్లించవచ్చని స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ డా. మారోజు రమచారి మాట్లాడుతూ తెలిపారు.2021,2022,2023,2024 (new) బ్యాచ్ సి బి సి యెస్ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ 2nd ఇయర్, 3rd ఇయర్ 07-08-2026 తోనే దరఖాస్తుల గడువు ముగుస్తుందని గమనించాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, బేగంపేట, సికింద్రాబాద్లో సంప్రదించాలని ఆయన సూచించారు.















