హైదరాబాద్ సెప్టెంబర్ 11 (ఈ తరం భారతం);తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో సంచార విముక్త జాతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ అనగారిన వర్గాలు, ఆత్మగౌరవం కోల్పోతున్న జాతుల కోసం మన పోరాటం ఆపవద్దని పిలుపునిచ్చారు.మనం అడుక్కునే దగ్గర కాదు కొట్లాడి సాధించుకొనే దగ్గర ఉండాలి.ఏ పదవిలో ఉన్నాం అని కాదు మన జాతి కోసం ఎం చేసాం అనేది ముఖ్యం.నేను మీవెంట ఉన్న, ఉంటా.కో అంటే కో అంట. – ఈటల చాలా రోజుల తర్వాత కలిసిన సంఘాలు. ఇక్కడ ఉన్నవారిని వందల సార్లు కలిసిన. 2002 లో నా రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు ఇక్కడ ఉన్న వారిని చాలామందిని కలిశాను. సకల జనుల సమ్మెలో చిన్న చిన్న కులాలు ఎక్కువ ఐక్యంగా ఎక్కువ మీటింగ్స్ పెట్టాయన్నారు. ధైర్యానికి సాహసానికి త్యాగానికి కొదువ లేని కులాలు సంచార జాతులు. తెచ్చుకున్న తెలంగాణలో నేను మొదటి ఆర్ధిక మంత్రి అయ్యా.. అప్పుడు ఈ కులాలు అన్నీ నా ఛాంబర్ కి వచ్చాయి. అప్పుడున్న అధికారులు నా రూమ్ కి వచ్చి వాసన వస్తుంది సర్ అని అంటే .. నా ఛాంబర్ లో సెంటు వాసన వస్తుంది అంటే బాధ పడేవాడిని చెమట వాసన వస్తుంది అని చెప్పినందుకు సంతోష పడుతున్న అని చెప్పిన. నా కాన్ఫరెన్స్ హాల్ ను మన జాతులకు అంకితం చేసి అన్ని మీటింగులు పెట్టుకొనే ఏర్పాటు చేశానన్నారు. ఇప్పటికీ కులం గుర్తింపు లేని జాతులు ఉండడం ఏంటని కొట్లాడి.. కుల సర్టిఫికెట్లు ఇప్పించాను. 40 రోజుల పాటు అసెంబ్లీ హాల్ నంబర్ వన్ లో అన్ని కులాలతో సమావేశంలు నిర్వహించాను. వారి బాధలు అన్నీ రాసుకొని… రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో బీసీ కాంక్లేవ్ పెట్టాను. మన బ్రతుకులు మార్చాల్సిన భాద్యత మన మీద ఉంది అని దిశా నిర్దేశం చేసామన్నారు.అక్కడి నుండి వచ్చినవే 250 రెసిడెన్షియల్ స్కూల్స్, కుల సంఘాల భవనాలు, 50 వేల రూపాయల నుండి 10 లక్షల వరకు ప్రభుత్వ గ్యారెంటీతో రుణాల మంజూరు చేయించాము. తెలంగాణాలో చైతన్యానికి కొదవలేదు. కానీ ఎక్కడో లోపం ఉంది దీనిని సరిచేసుకోవాలి. లేక పోతే ఇంకెన్నాళయినా మన బ్రతుకులు మారవు. నీ జాతి చరిత్ర నువ్వే రాసుకోవాలి.పాలకులు మీ మీద ప్రేమతో సమస్యలు తీర్చరు. మన ఓట్ల మీద ప్రేమతో చేస్తారు. ఆకలి దుఃఖం తెలిసిన వాడిగా పనిచేసా. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ పురుగుల అన్నం తిన్నావాడిని కాబట్టే సన్నబియ్యం పథకం తీసుకువచ్చిన. అనగారిన వర్గాలు, ఆత్మగౌరవం కోల్పోతున్న జాతుల కోసం మన పోరాటం ఆపవద్దని పిలుపునిచ్చారు.మనం అడుక్కునే దగ్గర కాదు కొట్లాడి సాధించుకొనే దగ్గర ఉండాలి.ఏ పదవిలో ఉన్నాం అని కాదు మన జాతి కోసం ఎం చేసాం అనేది ముఖ్యం.నేను మీవెంట ఉన్న, ఉంటా.కో అంటే కో అంట. – ఈటల చాలా రోజుల తర్వాత కలిసిన సంఘాల నేతలు మా వాడు అంటూ ఆత్మీయతతో ఆలింగనం చెసుకున్నరు.దాదాపు రెండు గంటల పాటు 39 కుల సంఘాలతో విడివిడిగా ఫొటోలు దిగారు.పేరుపేరున పలకరించడంతో సంతోషం వ్యక్తం చేసిన కులసంఘాల నేతలు.















