ఈతరంభరతం హైదరాబాద్ అక్టోబర్ 17 :
అన్నవరం దేవేందర్ రాసిన “అట్లనే” కవితా సంపుటిని డా. బిఆర్ అంబేద్కర్ ఓవెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్ సర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు. డా. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు జీవగడ్డ మిత్రులు ఆద్వర్యంలో చావడి వేదిక ద్వారా శుక్రవారం పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ మేము ఈ రోజు ఇక్కడ నిలబడడానికి కారణం జీవగడ్డ పత్రికనే అని తెలిపారు.
సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ మాట్లాడుతూ దేవేందర్ తెలంగాణ చరిత్రను తన కవిత్వంలో రాసారని తెలిపారు. జీవగడ్డ లేకపోతే మేము లేమని పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ దేవేందర్ తెలంగాణ భాషా నుడికారంలో సరళంగా కవిత్వం రాసారన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ రజని అధ్యక్షత వహించగా జీవగడ్డ మిత్రులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎల్వీకే రెడ్డి, ప్రముఖ కవి అందెశ్రీ, సంగిశెట్టి శ్రీనివాస్, గాజుల శ్యామ్ ప్రసాద్ లాల్, పొన్నం రవిచంద్ర , జ్వలిత, పిట్టల రవీందర్, వైయస్ శర్మ, ఎలగందుల రవి, చందు శివన్న, మంగళహారపు లక్ష్మణ్, ఆవునూరు సమ్మయ్య, తదితర కవులు ప్రతిభను హాజరయ్యారు.యూనివర్శిటీ డైరెక్టర్స్ , డీన్స్, టీచింగ్, నాన్ టీచింగ్ ప్యాకల్టీ తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా అన్నవరం దేవేందర్ పుట్టినరోజు ను ఘనంగా నిర్వహించారు.















