హైదరాబాద్ సెప్టెంబర్ 2 (ఈతరం భారతం);ఆదర్శ పాఠశాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ వెంటనే జీతాలు చెల్లించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు రాజ్యసభ సబ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు. తెలంగాణ మోడల్ స్కూల్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆద్వర్యం లో స్కూల్ డైరెక్టరేట్ ను ముట్టడించారు. ee కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. గత ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదు. దానికి అనుగుణంగా. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మోడల్ స్కూల్ ఔట్సోర్సింగ్ చిరు ఉద్యోగుల యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణించి మా పిల్లలకు మేము నిత్యావసర సరుకులు అందించలేకపోతున్నారని అన్నారు. పిల్లలకు జ్వరం వస్తే ఆసుపత్రి కి కూడా చూయించలేని పరిస్థితి నెలకొన్నది. వారి పాఠశాలల ఫీజులు, స్కూల్ బ్యాగులు, నిత్యావసర వస్తువులు కొనలేని దయనీయ పరిస్థితిలో వున్నాము. కుటుంబ సభ్యుల కనీస సౌకర్యాలు కూడా తీర్చలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.జీతాలు లేక ఆరు నెలలు గడుస్తున్న అధికారులు స్పందించకపోవదాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. తక్షణమే పెండింగ్ వేతనాలను మోడల్ స్కూల్ డైరెక్టర్ విడుదల చేయాలని, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.అలాగే పెండింగ్ వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఇప్పటికే ఉన్నటువంటి ఈఎస్ఐ, ఈపీఎఫ్ అనేవి కట్టకపోవడం వల్ల నష్టం కలుగుతుంది.కావున సమాన పనికి సమానం వేతనం చెల్లించాలని డిమాండ్ చేసారు. సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు వాటిని బేఖాతరు చేస్తున్నారు… ఇచ్చే 15 వేల జీతం అయినా సమయానికి ఇవ్వడం లేదు. దీని వలన ఉద్యోగులు మనోవేదనకు గురవదమీ కాకుండా చిన్న తరగతి కుటుంబాలు రోడ్డు న పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి ఒకటో తారీఖున జీతాలు చెల్లించే విధంగా చూడాలని కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.















