ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 11
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చేసింది. ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఆదివారం వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. హాల్టికెట్ నంబర్‌ను నమోదు చేసి – మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకోండి. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా మార్కుల మెమోను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో దాదాపు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. సీఎం రేవంత్ రెడ్డి సమయం కేటాయిస్తే ఇంటర్ ఫలితాలను ఆయన చేతుల మీదుగానే విడుదల చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. సీఎం అందుబాటులో లేనిపక్షంలో నాంపల్లిలోని ఇఁటర్ బోర్డు కార్యాలయంలో ఉన్నతాధికారులే రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు.















