ఈతరం భారతం హైదరాబాద్, సెప్టెంబర్ 24:ఉదయం తెలుగు దినపత్రిక మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ 5వ ప్రత్యేక సమావేశం మధ్యప్రదేశ్ లోని ప్రముఖ శైవక్షేత్రం ఉజ్జయినిలో ఘనంగా జరిగింది. ఈ కార్యవర్గ సమావేశానికి ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ త్వరలో ఉదయం మిత్ర మండలి సభ్యులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉదయం దినపత్రికలో పనిచేసినప్పుడు ఎదురైన సంఘటనలతో ఒక సావనీర్ తీయడానికి తీర్మానం చేశారు.ఈ సందర్భంగా వివిధ వృత్తులలో పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ సంస్థల ద్వారా రాష్ట్రస్థాయిలో అవార్డులు పొందిన ఉదయం పూర్వ పాత్రికేయులు కన్నా పరశురాములు, వెంకటేశ్వర రావు, ఉజ్జయిని, ఓంకారేశ్వర జ్యోతిర్లింగాల సందర్శన తో పాటు, 5వ ప్రత్యేక సమావేశానికి సకల ఏర్పాట్లు చేసిన ఉదయం దిన పత్రిక పూర్వ సిబ్బంది సర్దార్ ఓంకార్ సింగ్, సంసార్ సింగ్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి అచ్యుత రఘునాథ్, సహాయ కార్యదర్శి ముల్లంగి మోహన్ రెడ్డి, ఈ.సి మెంబర్ అవారి వెంకటేశ్వర శర్మ, సభ్యులు రామ్మూర్తి,రవీందర్ రావు,శ్రీధర్,సదానందం, లక్ష్మణ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.















