ఈతరం భారతం/హైదరాబాద్ /అక్టోబర్ 25:
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడే వారికి శిక్షలు తప్పవని చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టీ.జగన్ రెడ్డి హెచ్చరించారు. చిలకలగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాద్యతలు చేపట్టిన నేపద్యం లో ఆయనను కలిసిన మీడియా తో మాట్లాడారు. చిలకలగూడ పరిదిలో చిలకలగూడ, ఆలుగడ్డ బావి, మెట్టు గుడా ప్రాంతాలు ప్రదాన ట్రాఫిక్ సమస్యాత్మక ప్రాంతాలని, రైల్ నిలయం బ్రిడ్జ్ గుండా అటు చిలకలగుడా నుండి వచ్చే వాహనాల వళ్ళ ఒక్కోసారి బ్రిడ్జ్ లవద్ద ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని అలాంటి సమయం లో అప్రమత్తమై తమ సిబ్బంది తో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ వాహన దారులకు ఇబ్బంది కలుగ కుండా చేస్తున్నట్లు తెలిపారు.అంతే కాకుండా సికింద్రాబాద్ –యాదగిరిగుట్ట- వరంగల్ కు వెళ్ళే రహదారి ఇదే కావున విఐపి ల మూమెంట్లు ఉంటాయని,అలాంటి సమయాల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ ను నియంత్రించు తున్నట్లు తెలిపారు.ప్రతినిత్యం ఉదయం సాయంత్రం వేళల్లో కానిస్టేబుల్ హోంగార్డులు అక్కడ ఉండి ట్రాఫిక్ ను సాఫీగా వెళ్లే విధంగా కృషి చేస్తున్నామన్నారు ప్రధాన చౌరస్తాలో అంబులెన్స్ వచ్చిన సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆయన సాఫీగా వెళ్లిపోయే విధంగా ప్రజలు తీసుకుంటున్నామని అంబులెన్స్ వెళ్లిపోయాక మళ్ళీ యధావిధిగా ట్రాఫిక్ రాకపోకలు కొనసాగిస్తున్నామన్నారు. పై అధికారుల ఆదేశం మేరకు వారంలో మూడు రోజులు డ్రంక్ అండ్ డ్రైవ్ (ఆర్ఓపి )ప్రోగ్రామును చేపడుతున్నట్లు తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ సాయంత్రం,రాత్రి వేలల్లో కాకుండా మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుండి ఒంటిగంట వరకు కుడానిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సంబంధించి ఏర్పడిన ప్రధాన ఏర్పడిన సమస్యలుంటే నేరుగా తనను గా సంప్రదించవలసిన ఆయన కోరారు.. వ్యాపారస్తులు వ్యాపారస్తులకు కేటాయించిన ప్లేస్ లోనే వ్యాపారం చేసుకోవాలన్నారు వాటిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విధి నిర్వహణలో తమ సిబ్బంది సహకారాలు సమృద్ధిగా ఉన్నాయని అన్నారు















