హైదరాబాద్ సెప్టెంబర్ 1 (ఈ తరం భారతం);పాత పింఛను పథకం పునరుద్దరణ చేసే వరకు, విశ్రమించే ప్రసక్తే లేదని, సి పి ఎస్ ను రద్దు చేసేలా పాలకులను ఒప్పించి తీరతామని ఆల్ ఇండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ దక్షిణ భారత ఇంచార్జ్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.సోమవారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ..పాలకులు ఇక నైనా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించి చారిత్రక, సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల సొమ్ము ను షేర్ మార్కెట్ లో.. పెట్టి అక్కడ వచ్చే లాభ,నష్టాల తో పింఛను ఇవ్వాలి అనుకోవడం ఎంత వరకు భావ్యమో.. ఆలోచించించుకోవల్సిన అవసరం,ధర్మం ప్రభువుల విచక్షణ కే ఉందన్నారు. ఎన్నికల సమయంలో “సి పి ఎస్ రద్దు చేస్తాం” అని నమ్మబలికే రాజకీయ పార్టీలు, ఆ తర్వాత సి పి ఎస్ రద్దు ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. “సి పి ఎస్ రద్దు చేయండి అని మహా ప్రభో” అని అడిగినపుడల్ల ఉద్యోగులను ఏదో ఒకటి చెప్పి మభ్య పెట్టే ప్రయత్నమే చేస్తూ వచ్చారని రఘునందన్ ఎద్దేవా చేశారు.పాత పింఛను పథకం పునరుద్ధరణ గురించి ప్రభుత్వాలు ఇంకా కూడా మీన, మేషాలు లెక్కిస్తే..ఉద్యమం ఉదృతం చేయకతప్పని పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదని రఘునందన్ అభిప్రాయపడ్డారు.















