EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 13

వికసిత్ భారత్-2047 లక్ష్య సాధన కోసం ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి పేర్కొన్నారు. దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, పేదరిక నిర్మూలన, సమగ్ర అభివృద్ధితో పాటు నాణ్యమైన విద్య, వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మోదీ ధ్యేయమని ఆమె అన్నారు. బీజేపీ గోల్కొండ జిల్లా ఆధ్వర్యంలో శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నరేంద్ర మోదీ 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, గత 12 సంవత్సరాలుగా దేశ ప్రధానమంత్రిగా సేవలందిస్తూ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని తెలిపారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ నవనిర్మాణానికి దోహదపడే అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలను మోదీ అమలు చేశారని ఆమె కొనియాడారు. మోదీ కేవలం ప్రధానమంత్రిగా కాకుండా దేశానికి ‘ప్రధాన సేవకుడు’గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వం, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కిషన్ రెడ్డి పై పడి ఏడవడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని బంధకార్తీక మండిపడ్డారు.కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో రోడ్లు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే,కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలని కార్తీక పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలపై, నిరుద్యోగ భృతిపై ప్రజలు తిరగబడుతుంటే.. ఆ భయంతోనే సీఎం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవాచేశారు.ఈకార్యక్రమంలో బిజెపి గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఉమామహేందర్,గోల్గొండ జిల్లా బిజెపి సీనియర్ నేతలు సతీష్ సోలంకి,అల్లపురుషోత్తం సంజయ్,వెంకటెస్,షైలేందర్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top