హైదరాబాద్ సెప్టెంబర్ 28 (ఈతరం భారతం);కొంపల్లిలో యూని ప్లానెట్ – ఓవర్సీస్ స్టడీస్ సంస్థను ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ ఒకప్పుడు చదువుకొనే వారు హైదరాబాద్ రావడానికి వేరే దేశం వెళ్లినట్లు భావించేవారు.ఈ నలభై ఏళ్లలో ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారింది. ఒక వ్యక్తి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకో దేశంలో లంచ్, మరోదేశంలో డిన్నర్ చేసే స్థాయికి వచ్చిందన్నరు. భారతదేశం విద్యార్థులకు ఇతర దేశాల్లో చదవాలని మక్కువ పెరిగిందని,అమెరికా లండన్ యూరప్ దేశాలకువెళ్తున్నారు.అటువంటి పిల్లలకు సదుపాయాలు అందించేందుకు అనేక సంస్థలు వస్తున్నాయి.భరత రెడ్డి, రేఖ రెడ్డి, అజిత్, నిఖితారెడ్డి ఆధ్వర్యంలో యూని ప్లానెట్ అనే సంస్థను ప్రారంభించారు. కొంపల్లి చాలా వేగంగా విస్తరిస్తున్న ప్రాంతం. వేలమంది బయట దేశాలకు పోయే అవకాశం ఉందన్నారు. ఇక్కడ పెట్టిన ఈ సంస్థ ఈ ప్రాంత విద్యార్థులకు మరింత సేవా అందించి విశ్వాసాన్ని కల్పిస్తారని భావిస్తున్నాను. ఈ సంస్థ ప్రారంభించిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు..ఈ కార్యక్రమంలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, రాజిరెడ్డి, సతీష్ సాగర్, శివాజీ, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు
.















