EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఈతరంభారతం హైదరాబాద్ నవంబర్ 5 :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 7, 8, 9 తేదీల్లో కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రూ. 9,100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే యనున్నారు.ఇందులోమెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభంతో పాటు రైతులు, పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి సమావేశాలు ఉన్నాయి.రూ. 5,060 కోట్లతో రేడియల్ రోడ్డు-2, పబ్లిక్ స్కూళ్లు, వ్యవసాయ కళాశాల సహా 13 అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రూ. 46.08 కోట్లతో పూర్తయిన 10 భవనాల ప్రారంభోత్సవంచేయనున్నారు.నవంబర్ 9న హకీంపేటలో 10 జిల్లాల రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Related News

Select the Topic
Scroll to Top