EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

క్రీడలతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం ఉద్యోగులకు నిరంతరం క్రీడా పోటీలు  రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ ఆగష్టు 28 (ఈ తరం భారతం);పసి పిల్లలనుండి పండు ముదుసలి వరకు అన్ని వర్గాల వారు క్రీడా మైదానాల వైపు ఆకర్షితులయ్యే విధంగా తెలంగాణ ప్రభుత్వం క్రీడా శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. జాతీయ క్రీడ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ఎల్బీ ఇండోర్ స్టేడియంలోఉద్యోగుల ఆటల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన క్రీడా విధానంలో ఎటువంటి వివక్షత లేకుండా అన్ని వయసుల వారు వర్గాల వారు క్రీడల్లో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు.అనునిత్యం పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు ఉపశమనానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని, ఉద్యోగులు ఆరోగ్యకరంగా ఉంటే ప్రభుత్వ పథకాలు పటిష్టంగా అమలవుతాయి అని ఆయన అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడా ప్రోత్సాహక ప్రభుత్వం అన్ని వర్గాలకు క్రీడల్ని అందుబాటులోకి తేవాలని కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గత సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం లో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించామని అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా పోటీలు నిర్వహించడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు, టీజీవో కార్యదర్శి సత్యనారాయణ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి ప్రేమ్ దేవేందర్, భాగ్యనగర్ టీఎన్జీవో అధ్యక్షులు సత్యనారాయణ హైదరాబాద్ టీజీవో అధ్యక్షుడు కృష్ణ యాదవ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాస్య నాయక్ కార్యదర్శి ఖాదీర్ హుస్సేన్ వివిధ శాఖల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు కోచెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

29 న గచ్చిబౌలి లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

హాకీ మాంత్రికుడు స్వర్గీయ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 29 గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను జరపడానికి స్పోర్ట్స్ అథారిటీ ఏర్పాట్లు చేసింది. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో ఇటీవల వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను సన్మానించడం తోపాటు వివిధ క్రీడా సంబంధిత కార్యక్రమాలు ను ఏర్పాటు చేశారు. అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీతలతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top