ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 11
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నేత వి హనుమంతరావును హైదరాబాద్ గాంధీభవన్ లో టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రేమ్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. దళిత, వెనుకబడిన తరగతుల సంక్షేమం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం తదితరాంశాలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ముఖ్య నాయకులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.















