ఈతరం భారతం/హైదరాబాద్/ అక్టోబర్ 23:
గో రక్షకుడు ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ పై ఎంఐఎం పార్టీ నాయకుడు ఇబ్రహీం చేసిన దాడిని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు .ఎన్.రామచంద్రరావు & డి.గోపాల్ జి ఇతర బిజెపి నాయకులను డిజిపి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా శాంతి యుతంగా కార్యక్రమాన్ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు .ఎన్.రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బిజెపి తెలంగాణ కార్యకర్తలు మరియు గో రక్ష కార్యకర్తలపై వారి అందంతో దాడి చేస్తోందని విమర్శించారు.ఇటువంటి సంఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. అలాగే, నిందితులకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.















