ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 2 : శ్రీ కృష్ణ దేవరాయ తెలుగుభాషా నిలయం 125 వ స్థాపన దినోత్సవ సందర్బంగా హైదరాబాద్ లోని కార్యాలయం లో పౌర గ్రంధాలయాలు – నాడు నేడు అనే అంశం పై రాష్ట్ర స్థాయి గ్రంధాలయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో గ్రంధాలయోద్యమకారులు అనుముల శ్రీనివాస్ పాల్గొని ప్రస్తుత తరుణం లో ఊరూరా గ్రంధాలయాల స్థాపన దాని ఆవశ్యకత పై ప్రసంగించడం జరిగింది. ఈ సందర్బంగా రెండు దశాబ్దాలుగా ఊరూరా గ్రంధాలయాల స్థాపనకు విశేషమైన కృషి చేస్తున్న అనుముల శ్రీనివాస్ కు ప్రొఫెసర్ డా . ఎస్ సుదర్శన్ రావు మరియు భాషా నిలయం సంయుక్త కార్యదర్శి నరసింహ మూర్తి శాలువా ప్రశంసా పత్రం తో ఘనంగా సన్మానించారు.ఇంకా ఈ కార్యక్రమం లో భాషా నిలయం కార్యదర్శి టి.ఉదయవర్లు, ప్రొఫెసర్ ఎన్ .లక్ష్మణ రావ్ ,డా. విశ్వమోహన్ ,డా .వివేక్ వర్ధన్ ,డా. చక్రవర్తి ,టివి ప్రఫుళ్ళ చంద్ర ,సామాజిక సేవకులు శివశెట్టి శివప్రసాద్, డా. మురళి ప్రసాద్, డా. చేగొని రవికుమార్ ,మాలోత్ సైదానాయక్ తదితరులు పాల్గొన్నారు.















