EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చదువు తప్ప క్రీడలను ప్రోత్సహించే ఆస్కారం లేకుండా పోయింది     మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్ / బోడుప్పల్ సెప్టెంబర్ 14 (ఈతరం భారతం);చదువు తప్ప క్రీడలను ప్రోత్సహించే ఆస్కారం లేకుండా పోయిందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.బోడుప్పల్లో 29వ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు తప్ప క్రీడలను ప్రోత్సహించే ఆస్కారం లేకుండా పోయింది.ఉదయాన్నే లేచి గంట రెండు గంటల పాటు ట్రైనింగ్ పొందడం అనేది మామూలు విషయం కాదు. పిల్లలంతా సెల్ఫోన్లలో ఆడుకుంటున్న ఈ రోజుల్లో…. క్రమశిక్షణగా జీవించాలి, మనకు మనం రక్షించుకోవాలి అని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రోత్సహించి మంచి ఆరోగ్యవంతమైన విద్యార్థులు తీర్చిదిద్దడంలో మీరు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు..గెలిచిన ఓడిన స్పోర్ట్స్ మాన్ స్పిరిట్ తో మరింత పట్టుదలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నానన్నారు..ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, రవి, మహేష్, ఫనిందర్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top