హైదరాబాద్ సెప్టెంబర్ 24 (ఈతరం భారతం);బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన నూతనంగా నియమించబడిన రాష్ట్ర పదాధికారులతో బుదవారం సమావేశం జరిగింది.కొత్తగా నియామకమైన ఆఫీస్ బేరర్స్‌తో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తొలిసారిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు.ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ , జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు , రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి డా. గౌతం రావు మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలపై సమీక్ష మరియు ప్రణాళిక రూపొందించడం జరిగింది.నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఎంఎస్ఎంఈఎస్ ఇలా అనేక వర్గాలకు లబ్ధి కలిగేలా జీఎస్టీని తగ్గిస్తూ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లున్ తెలిపారు. తగ్గించిన జీఎస్టీ కూడా అమలులోకి రావడం జరిగింది. దీనిపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో వినియోగదారులను కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా స్వదేశీ ఉద్యమంలో భాగంగా అన్ని జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కూడా తీర్మానించారు.ముఖ్యంగా సెప్టెంబరు 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారి జీవన ప్రయాణంపై ప్రత్యేకంగా ‘మేరా దేశ్ పహలే’ కల్చరల్ కార్యక్రమం హైటెక్ సిటీలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల 30వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలో “మేరా దేశ్ పహలే” కల్చరల్ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు 10 వేల మంది పాల్గొనే విధంగా కార్యక్రమం రూపొందించబడింది.అదేవిధంగా రాబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పై కూడా ఈ సమావేశంలో చర్చించాం. ఈ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు,… ప్రజాసమస్యల పరిష్కారంలో, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిరక్ష్య వైఖరిని ఎండగట్టేలా చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలను వివరించి ప్రజల్లో చైతన్యం కల్పించేలా అవగాహన కార్యక్రమాలను జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు.రేపటి నుండి అసెంబ్లీ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాలను బిజెపి విస్తృతంగా చేపట్టనుంది.ఈ మీడియా కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ , పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ పాల్గొన్నారు.















