ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 29 :
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈనెల(అక్టోబరు) 27వ తేదీన పారా మిలిటరీ బలగాలు వస్తున్నాయని పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 8 కంపెనీల పారా మిలిటరీ బలగాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పని చేస్తాయని వెల్లడించారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారా మిలిటరీ బలగాలు విధుల్లో ఉంటాయని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు.
.















