EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా? లేక మజ్లిస్ పోటీ చేస్తుందా?

హైద్రాబాద్ అక్టోబర్ 13 (ఈతరం భారతం); ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేంద్రీకృతమైందని ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పోటీ చేస్తుందా? లేక మజ్లిస్ పోటీ చేస్తుందా? లేక మజ్లిస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేస్తున్నాడా? అన్న అనుమానం కలుగుతోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ, ఇప్పుడున్న కాంగ్రెస్ అభ్యర్థి గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ వచ్చిన తర్వాత, నేరుగా ఎంఐఎం అధినేత దగ్గరకు వెళ్లి కాళ్లమీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు.దీన్నిబట్టి స్పష్టంగా తెలుస్తోంది.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎంఐఎంకి చెందిన వారే.గతంలో ఎంఐఎం గుర్తు ‘పతంగి’ మీద పోటీ చేశారు. ఇప్పుడూ ఎంఐఎంకు చెందిన వ్యక్తే, కానీ ఈసారి హస్తం గుర్తు మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇది ప్రజలను మోసం చేసే చర్యే.ఈరోజు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ మద్దతుతో గెలవాలనే ఆలోచనతో, ఎంఐఎంకు చెందిన అభ్యర్థిని కాంగ్రెస్ టికెట్ మీద పోటీకి దింపుతోంది.ఎంఐఎం–కాంగ్రెస్ మధ్య బంధం స్పష్టంగా కనపడుతోంది.గతంలో ఎంఐఎం బీఆర్ఎస్ తో కూడా కాపురం చేసింది. ఎంఐఎం మద్దతుతోనే గతంలో సిటీలో బీఆర్ఎస్ కొన్ని సీట్లలో గెలిచింది.గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం – రెండూ కలిసి సిటీని, జీహెచ్ఎంసీని నిర్లక్ష్యం చేశాయి.జూబ్లీహిల్స్ లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు సరిగా లేవు. ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేని నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్పష్టమైన ఉదాహరణ.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ను విశ్వనగరంగా చేస్తామని చెప్పి, విషాదనగరంగా మార్చింది.కాంగ్రెస్ పార్టీ గెలిచాక వంద రోజుల్లో హామీలు పూర్తి చేస్తామని చెప్పారు. ఆరు గ్యారంటీలు, 420 వాగ్ధానాలు చేశారు. కానీ ఇంతవరకు నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడేదంతా 420 కేసుల్లానే మిగిలింది.దేశ వ్యాప్తంగా, ఇటు తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం స్పష్టంగా కనపడుతోంది. జూబ్లీహిల్స్ ప్రజలు గమనించాలి.తెలంగాణలో 8 ఎంపీ సీట్లలో బిజెపిని గెలిపించి ఆదరించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కూడా బిజెపిని గెలిపించాలని కోరుతున్నాను.రేపు అసలైన ప్రతిపక్షంగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను నిలదీసి, వాటిని అడ్డుకుంటాం.బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ప్రజలకు లాభం లేదు. ఎందుకంటే ఆ పార్టీలోని నాయకులు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారనేది తెలియదు.కాబట్టి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థికి అవకాశం ఇచ్చి, అసలైన ప్రతిపక్షంగా బలపరచి, అసెంబ్లీలో ప్రజావాణిని బలంగా వినిపించేలా బిజెపిని గెలిపించాలని కోరుతున్నాను.ప్రజలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు. బిజెపి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో గెలుస్తుందని నమ్ముతున్నాను.జూబ్లీహిల్స్ ప్రజలందరూ రాజకీయ చైతన్యంతో ఆలోచించి, బిజెపికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ , బిజెపి ఎస్టి మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ , బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ , పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు , తదితరులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీలో పెద్దఎత్తున చేరికలు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సుపరిపాలన, వికసిత్ భారత్ లక్ష్యంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈరోజు భారతీయ జనతా పార్టీలో వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారికి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈరోజు ఖమ్మం నుంచి డాక్టర్ కాసాని మారుతి గౌడ్ గారితో పాటు లండన్ నుంచి ఎన్నారై శశి గారు మరియు వారి బృందం బిజెపిలో చేరారు. అదేవిధంగా దేవరకొండ, నాగర్ కర్నూలు నియోజకవర్గాల నుంచి కూడా నాయకులు బిజెపిలో చేరారు.

Related News

Select the Topic
Scroll to Top