ఈతరం భారతం/హైదరాబాద్ /అక్టోబర్ 23 :
తెలంగాణలో నడుస్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు కాదు.. రేవంతుద్దీన్ సర్కారని గోవులను రక్షిస్తున్న ప్రశాంత్ సింగ్ పై అభాండాలు వేస్తారా? బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెసారు.గోవులను కాపాడుతున్న ప్రశాంత్ పై హత్యాయత్నం చేసినవారిని కాపాడే ప్రయత్నమే ఇది..!!ప్రశాంత్ (సోనూ సింగ్) పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం.గోవుల రక్షణకు కొత్త పాలసీ తెస్తామని.. ఇప్పుడు గోవులను కోసేవాళ్లకు గన్ లైసెన్సులు ఇస్తున్నారా?అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తోందా?తక్షణమే బాధ్యులైన ఎంఐఎం గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణలో గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి. డిమాండ్ చేసారు.తెలంగాణలో నడుస్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు కాదు.. రేవంతుద్దీన్ సర్కారు. ఎంఐఎం గూండాలను కాపాడటానికే రేవంత్ సర్కారు ఉందా..? నిన్న గోరక్షకుడు ప్రశాంత్ (సోనూసింగ్)పై ఆవుల అక్రమ రవాణా మాఫియా కాల్పులు జరిపితే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం గోరక్షకుడిపై అభాండాలు మోపి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు.గోరక్షకుడు సోనూ సింగ్ పై కాల్పుల ఘటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి మెమోరాండం అందించేందుకు బయల్దేరిన క్రమంలో, నాతో పాటు సుమారు 100 మంది బిజెపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కి తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.గోవులను తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడంతో, ఎంఐఎం కు చెందిన గూండాలు జరిపిన కాల్పుల్లో సోనూ సింగ్ తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సోనూ సింగ్ పై లేనిపోని అభాండాలతో, కేసు సెటిల్‌మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం. అదే విధంగా, ఈ ఘటనపై మేం డీజీపీతో మాట్లాడటానికి వెళ్తుంటే అరెస్ట్ చేయడం దుర్మార్గం.తెలంగాణ రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం కొత్తగా పాలసీ తెస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు గోవులను కోసేవాళ్లకు గన్ లైసెన్సులు ఇస్తోందా..? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నడుస్తోందా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గోవులను తరలించే గుండాలను, మాఫియా రెచ్చిపోతోంది. గోరక్షకులపై అనేక దాడులు పెరిగాయి. దానికి పరాకాష్ట.. ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ (సోనూ సింగ్) ను కాల్చి చంపే ప్రయత్నం చేయడమే. అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎటు వైపు ఆలోచిస్తున్నదో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.. ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి.ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి. లేనిపక్షంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.















