EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు… బతుకమ్మ చీరల పంపిణీ చేయాలి  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి డిమాండ్

హైద్రాబాద్ (భాగ్యనగరం)సెప్టెంబర్.20 :బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే సంప్రదాయం తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది.తెలంగాణలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తానని… ఇప్పుడు కేవలం డ్వాక్రా మహిళలకు మాత్రమే చీరల పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని అన్నారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక్ రెడ్డి.

తెలంగాణలో కోటి 30 లక్షలకు పైగా అర్హులైన మహిళలు ఉన్నారు.కేవలం 65 లక్షల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేస్తానడం సరైన నిర్ణయం కాదు..తెల్ల రేష‌న్‌కార్డు ఉన్న ప్ర‌తి మ‌హిళ‌కు ఉచితంగా నాణ్య‌మైన రెండు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణీ చేయాలి.బతుకమ్మ పండుగ అంటేనే.. తెలంగాణ మహిళలకు ఒక ప్రత్యేకత ఉంది..గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన చీర‌లు నాణ్య‌త లేనివి మాత్ర ఇచ్చారు. అప్ప‌టి ప్ర‌భుత్వం చీర‌ల పంపిణీలో BRS నాయ‌కులు చెతివాటం ప్ర‌ద‌ర్శించ‌డంతో ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన చీర‌లు అంద‌లేదు. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు… బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయాలన్నారు.

మహిళా సంఘాల గ్రూప్లో ఉండే వారికి మాత్రమే బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తే.. మిగిలిన మహిళలు బతుకమ్మ పండుగ చేసుకోవద్దా?

ప్ర‌భుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మ‌హిళలందికి ఎందుకు పంచ‌డం లేదు.. పండ‌గ అనేది కేవ‌లం స్వ‌యం స‌హాక బృందాల‌కు మాత్ర‌మే కాదుకాదా.. అని ప్రశ్నించారు.తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది  ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లను ఆకర్షించుకునేందుకు, వారి నుంచి లబ్ధి పొందేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.మహిళలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపించడం లేదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు వాగ్దానాలతో మహిళలను మోసం చేశారన్నారు.రేవంత్ రెడ్డి చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిండు. దాదాపు 20 నెలలకు పైగా సమయం అయిపోయింది అయినా గాని ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క విద్యార్థి కన్నా స్కూటీ ఇచ్చిందా ఎన్నికల గట్టెక్కడానికి ఇటువంటి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు.తులం బంగారం ఇస్తానన్నాడు కానీ రేవంత్ రెడ్డి కొనడానికి తెలంగాణలో అసలు తులం బంగారం దొరుకుతలేదా. ప్ర‌తి సంవ‌త్స‌రం దాదాపు 1.5 ల‌క్ష‌ల వివాహాలు జ‌రుగుతున్నాయి. పెళ్లి సమయంలో కానుకగా ఇస్తానన్న బంగారం… పిల్లలు పుట్టినాక కుడా ఇంతవరకు బంగారం ఇవ్వలే.మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.

22 నెలలు అధికారంలో ఉన్నా ఆ హామీని అమలు చేయలేదన్నారు.ఈ లెక్కన ఒక్క మహిళకు రూ.50000 పెండింగ్‌ ఉందన్నారు.ఎన్నికల సమయంలో 500 కే గ్యాస్ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు కానీ ఒక్క మహిళ ఖాతాలో కూడా సబ్సిడీ 500 రూపాయలు జమ చేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వంఇందిరా మ‌హిళ శ‌క్తి పేరుతో చీర‌ల‌ను పంపిణీ చేస్తున్నారు. మ‌న తెలంగాణ చ‌రిత్ర ఎంతో గోప్ప‌ది. ఇక్క‌డి సంస్కృతికి చిహ్నంగా స్థానిక మ హిళ‌ల పేరుతో చీర‌ల పంపిణీ చేయాలి.. చాక‌లి ఐల‌మ్మ, రాణిరుద్ర‌మ దేవీ వంటి అనేక మంది గోప్ప‌వాళ్ల ఉన్నారు. వారిని గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది.మహిళా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని… లేని పక్షంలో రాష్ట్రం లో ఉన్న మ‌హిళ శ‌క్తి అంటే ఏంటో రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి అర్థం అయ్యే రోజు తొంద‌ర్లోనే వ‌స్తుందని హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top