ఈతర భారతం/హైదరాబాద్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదైంది. ఓ భూమి కబ్జా వ్యవహారంలో ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 7లో ఉన్న తన ఇంటిని బెల్లంకొండ సురేష్ అక్రమంగా ఆక్రమించారంటూ శివ ప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.తాను కొంతకాలంగా బంధువుల వద్ద ఉంటున్నానని, ఈ సమయంలో బెల్లంకొండ సురేష్ అనుచరులు ఇంటి తాళం పగలగొట్టి, ఇంటి స్థలం ఆక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు IPC సెక్షన్లు 329(4), 324(5), 351(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ వ్యవహారంపై బెల్లంకొండ సురేష్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.















