EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నేటి ధ్యేయాలు నాటి గేయాలు గ్రంథం తప్పనిసరిగా చదవదగినది         డాక్టర్ కేవీ రమణాచారి

హైదరాబాద్ అక్టోబర్ 13 (ఈతరం భారతం); సాంస్కృతి, సత్యాన్ని, ధార్మికతను, జాతీయతను సంస్కారాన్ని తన జీవితానికి ఆపాదించుకొని పెద్దబాలశిక్ష లాంటి గ్రంథాన్ని మనకందించిన కాలాన్ని జయించిన ఆదర్శమూర్తి మనోహర్ రావు కృషి ప్రశంసనీయమని ముఖ్య అతిథి డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. పివి ఫౌండేషన్ ,సర్వార్థ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పివి మనోహర్రావు రచించిన నేటి ద్యేయాలు నాటి గేయాలు గ్రంధావిష్కరణ కార్యక్రమం రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది .సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెలుదండ నిత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈనాటి ద్యేయాలు ఆనాటి గేయాలు గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. పద్యాలు గేయాలు సూక్తులు దినచర్య లోని చరిత్రను స్వీకరించి స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేసిన మనోహర్ రావు పుస్తకం అన్ని రంగాలను దృశ్యమాన చేసిందని అన్నారు, ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సురభివాని దేవి మాట్లాడుతూ మనోహర్ రావు జీవితం నడిచే పుస్తకమని ఆయన ఎందరికో ఆదర్శ ప్రాయుడని అన్నారు .సాహితీ ప్రముఖులు గౌరి శంకర్ డాక్టర్ బి జయ రాములు పివి మనోహర్రావు, నండూరి బంగారయ్య, బి శ్రీనివాసరావు, దైవజ్ఞశర్మ ,గ్రంథకర్త తదితరులు ప్రసంగించారు మానస ఆర్ట్స్ కార్యదర్శి రఘు శ్రీ సహకారం అందించగా పీఎంకే గాంధీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా గ్రంథకర్త పివి మనోహర్రావు దంపతులను అతిధులు ఘనంగా సత్కరించారు సభా కార్యక్రమానికి ముందు కుమారి వేదా ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు శ్వేత జగన్నాధ రావు ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి నిర్వాహ సంస్థల పక్షాన పివి మనోహర్ రావు పి వి మదన్మోహన్ పీవీ రాజమోహన్ (కిరణ్) సంస్థ ఆశలను వివరించి సభ సమన్వయం గావించారు

Related News

Select the Topic
Scroll to Top