ఈ తరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 27 :కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య ఎన్ గోపి సతీమణి,ప్రముఖ కవయిత్రి ఎన్ అరుణ అంతిమ సంస్కారక్రియలు శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ డిడి కాలనీ సత్య సాయి స్కూల్ సమీపంలోని స్మశాన వాటికలో అంతిమ సంస్కారక్రియలు జరగనున్నాయి. రామంతపూర్ లోని స్వగృహంలో అరుణ పార్థివ దేహాన్ని పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, కవులు, కవయిత్రులు, అధ్యాపకులు, వివిధ సాహిత్య సంస్థల ప్రతినిధులు, పరిశోధకులు, విద్యార్థులు, బంధుమిత్రులు సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. అరుణ మృతి సాహితీ రంగానికి తీరని లోటని వారు చెప్పారు.















