EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రజల దగ్గర ఉండే దిశగా భారతీయ జనతా పార్టీ విధివిధానాలు

హైదరాబాద్ సెప్టెంబర్ 12 (ఈ తరం భారతం );భారతీయ జనతా పార్టీ విధివిధానాలు ప్రజల దగ్గర ఉండే దిశగా స్పష్టంగా ఉన్నవి. ప్రజల సమస్యలను ఎప్పుడూ తెలుసుకొని, వాటిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తూ, నిఖార్సైన చర్యలు తీసుకుంటుందని భారతీయ జనతా పార్టీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీల విధానాన్ని పోల్చితే… వారు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎన్నికలు పూర్తైన తర్వాత ప్రజల సమస్యలపై పట్టించుకోరు. కానీ భారతీయ జనతా పార్టీలో ఇలాంటి అలసత్వం ఉండదు.భారతీయ జనతా పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజాసేవే ప్రధాన ఉద్దేశ్యంగా స్వీకరించి, ప్రతి కార్యకర్త అదే మంత్రంతో ముందుకు వస్తున్నారు. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త “నేను దేశ సేవకుడిని. దేశ సేవ కోసమే రాజకీయాల్లో ఉన్నాం” అని స్పష్టంగా చెబుతారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కావాలనే ఆశతో కాకుండా, దేశానికి సేవ చేయాలనే తపనతోనే పనిచేస్తారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు, కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం కనీసం 15 రోజుల పాటు ప్రజల సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే దిశగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.కేంద్ర ప్రభుత్వంతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేలా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తోంది.ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో కలెక్టర్ నోడల్ ఏజెన్సీగా నియమించుకొని ఈ సేవా కార్యక్రమాలు సమన్వయంగా నిర్వహిస్తున్నారు.భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రంలో కనీసం 75 బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని ఆలోచన చేయడం జరిగింది. ఈ ఆలోచనకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గారు ఆమోదం తెలిపారు. ప్రతి క్యాంపులో కనీసం 75 యూనిట్ల బ్లడ్ డొనేషన్ సాధించాల్సిన లక్ష్యంగా నిర్ణయించాం.సెప్టెంబర్ 17న బ్లడ్ డొనేషన్ క్యాంపులు, 18 వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమం, 21వ తేదీన మారథాన్, అదేవిధంగా 25వ తేదీన ధీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాం.అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమం దృష్ట్యా ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డు పొందిన వ్యక్తులను ప్రత్యేకంగా సన్మానిస్తాం.అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారి జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని, ఆత్మనిర్భర్ భారత్ భావనను ప్రోత్సహిస్తూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం. ప్రతి వ్యక్తి ఖాదీ వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా దేశీయ పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరుతాం.బిజెవైఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 21న ప్రత్యేక మారథాన్ – ‘3K NAMO YUVA RUN – FOR A DRUG FREE NATION’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ మారథాన్ ద్వారా దేశ యువతలో డ్రగ్స్ వ్యసనాన్ని నిరోధించి, మత్తులో కాకుండా సరైన మార్గంలో నడిపించి, భారతదేశాన్ని డ్రగ్ ఫ్రీ నేషన్‌గా తీర్చిదిద్దాలని అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం.ఈ కార్యక్రమం ద్వారా మన దేశం, తెలంగాణ రాష్ట్రం, యువతకు నూతన స్ఫూర్తిని నింపేలా ముందుకెళ్తాం.ఈ మారథాన్‌ను మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ వారు కండక్ట్ చేస్తున్నారు.డ్రగ్స్ వ్యసనాన్ని నిరోధించడం, యువతను మత్తులోకి కాకుండా సరైన మార్గంలో నడిపించి, దేశాన్ని డ్రగ్ ఫ్రీ నేషన్‌గా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యం.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం (ఎన్టీఆర్ మార్గం) నుండి ప్రారంభమై, నెక్లెస్ రోడ్డులో యూ-టర్న్ తీసుకొని తిరిగి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముగుస్తుంది.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా పాల్గొనాలని కోరారు. ఇది కేవలం యువతకోసం మాత్రమే కాకుండా, సమాజంలోని ప్రతి వ్యక్తికి డ్రగ్స్ వ్యసనంపై అవగాహన పెంచే గొప్ప ప్రయోజనం కలిగించే కార్యక్రమం.పోస్టర్స్‌లో ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా వ్యక్తిగత వివరాలు నమోదు చేయవచ్చు.మీ టీ షర్ట్ సైజ్‌ను కూడా నమోదు చేయడం ద్వారా, అందుకు అనుగుణంగా ప్రత్యేకంగా టీ షర్ట్ అందజేయబడుతుంది.పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా సర్టిఫికెట్ అందజేయబడుతుంది. ఈ సర్టిఫికెట్, ఉద్యోగ అప్లికేషన్లు, యూనివర్సిటీ ప్రవేశాలు తదితర సందర్భాల్లో ఉపయోగపడుతుంది.ఈ మారథాన్ ద్వారా ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాం – డ్రగ్స్ దారిలో మీరు వెళ్ళకండి. ఎవరైనా మీకు డ్రగ్స్ ఆఫర్ చేస్తే మీరు దీన్ని తిరస్కరించడానికి క్రెడిబిలిటీ పొందగలుగుతారు.ఇటీవల హైదరాబాద్‌లో రూ.12,000 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మన యువతను డ్రగ్స్ బారిన పడకుండా, సరైన మార్గంలో నడిపించడం మనందరి బాధ్యత అని అన్నారు..మొత్తం దేశంలో 75 స్థానాల్లో, 10 లక్షల మందికి పైగా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నాం.అదేవిధంగా ట్రెక్కింగ్ క్లబ్, వాకింగ్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్, టీచర్స్ అసోసియేషన్స్, పేరెంట్స్ అసోసియేషన్స్, స్కూల్ అసోసియేషన్స్ వంటి ఏ క్లబ్ అయినా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు.ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు, స్వచ్ఛంద భావనతో, సేవా ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.ఎవరైనా మారథాన్ రన్ చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా, తమ సన్నిహితులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసారు

.

 

Related News

Select the Topic
Scroll to Top