హైదరాబాద్ ఆగస్టు 28 (ఈతరం భారతం); ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధుల కార్యక్రమంలో భాగంగా గురువారం గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రం లో ఆయన పాల్గొన్నారు.అనంతరం మీడియా సమావేశం లో మాటాడుతూ రేషన్ కార్డు,డబుల్ బెడ్ రూం,రుణమాఫీ సమస్యలపై నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది ప్రజావాణి కార్యక్రమం ఇది మంచి కార్యక్రమం గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇవ్వలేదుబిఆర్ఎస్ పార్టీ పేద ప్రజలను పట్టించుకోలేదుమా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందిడబుల్ బెడ్ రూం ఇల్లు నియోజకవర్గానికి మొదటి దఫాలో 3500 ఇళ్లు ఇవ్వడం జరుగుతుందిగత ప్రభుత్వ హయంలో రేషన్ కార్డుల పంపిణీ చేయలేదుకనీసం రేషన్ కార్డుల్లో పేర్లు ఎక్కించడం,లేని వారివి తొలగించడం లేదు….అందుకే ఇప్పుడు ప్రభుత్వం పై చాలా బడ్జెన్ పడుతుందన్నారు.సిద్దిపేట,సిరిసిల్ల,గజ్వేల్ లో మాత్రమే గత ప్రభుత్వ హయంలో అభివృద్ధి చెందాయిమా ప్రభుత్వ హయంలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తాంలక్ష కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం కట్టారు… పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టు పూర్తి చేయలేదుగత ప్రభుత్వం దక్షిణ తెలంగాణను పూర్తిగా విస్మరించిందిఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు హరీష్ రావు హిమయత్ సాగర్ నిండటం వల్ల మూసి పైన మాట్లాడి ఉంటారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రాజకీయాలు చేస్తున్నారు హరీష్ రావు నిరంతరం ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డిప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజలను ఆదుకోవటానికి సిద్ధంగా ఉందిబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందికేసీఆర్ అనుభవం ఉన్న వ్యక్తి అసెంబ్లీకి రావాలని,కాళేశ్వరంపై కేసీఆర్ స్పందించాలన్నారు.















