హైద్రాబాద్ సెప్టెంబర్ 2 (ఈతరంభారతం )జీవిత బీమా రంగంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ ఐ సి) ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎల్ఐసీ నాంపల్లి సిటీ బ్రాంచ్ 3 సీనియర్ బ్రాంచ్ మేనేజర్ (ఎస్ బి.ఎమ్) మహమ్మద్ అబ్దుల్అజీమ్ పేర్కొన్నారు ప్రపంచం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారికి బలైపోయిన వేలాది మంది పాలసీదారుల కుటుంబాలను ఆర్ధికంగా అదుకుని అండగా నిలిచిన చరిత్ర ఒక్క ఎల్ ఐ సి కే దక్కిందని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు ఎల్ఐసి ఆఫ్ ఇండియా 69వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నాంపల్లిలోని సిటీ బ్రాంచ్- 3 కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఎస్బిఎమ్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ జ్యోతిప్రజ్వలనతో వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎల్ఐసీ ఆఫ్ ఇండియా గత 69 సంవత్సరాలుగా నమ్మకమే పునాదిగా జీవితాంతం. జీవితానంతరం కూడా పాలసీదారుల సేవలో.. అనే సిద్ధాంతంతో పాలసీదారులకు మెరుగైన సేవలందిస్తూ వస్తోందని అన్నారు. గత ఇరవై సంవత్సరాలుగా ప్రైవేటు బీమా కంపెనీలతో కూడా పోటీ పడుతూ ప్రతీయేటా అత్యధిక మార్కెట్ షేర్ను సాధిస్తూ తన నెంబర్వన్ స్థానపు ఉనికిని చాటుకుంటూ వస్తోందన్నారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారులు, ఉద్యోగులతో పాటు ఉత్తమ ఏజెంట్లను, పాలసీదారులను ఆయన సన్మానించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ (సేల్స్) శ్రీధర్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డివిజనల్ ప్రతినిధి బేజాడి భాస్కర్, డెవెలప్మెంట్ అధికారులు శ్రీనివాస్ రావు, మమత, అధికారులు తిరుమలకుమారి, సురేష్ కుమార్, సుధ, చంద్రశేఖర్రావు, ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసిఇయు) సీబీ-3 అధ్యక్షురాలు కె సరిత, కార్యదర్శి పి. ఎన్. దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షులు ఆర్ కరుణాకర్, కోశాధికారి ఎమ్ బాలరంగయ్య, సుమతి, ఈసీ సభ్యులు బషీరుద్దీనాఖాన్, ఉమెన్స్ సబ్ కమిటీ సభ్యురాలు ఆర్.కవిత, ఉద్యోగులు, పాలసీదారులు తదితరులు పాల్గొన్నారు.















