EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రైవేట్ మేనేజ్మెంట్ల అసోసియేషన్లు కాలేజీలు బంద్ పిలుపు కు బిజెపి సంపూర్ణ మద్దతు

హైదరాబాద్ సెప్టెంబర్ 15 (ఈతరం భారతం);తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ మేనేజ్మెంట్ల అసోసియేషన్లు కాలేజీలు బంద్కు పిలుపు నిర్ణయానికి బిజెపి సంపూర్ణ మద్దతు తెలుపుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. సోమవారం పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కాలేజీలకు భారీగా బకాయిలు పెరగడంతో, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎదురయ్యాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితికి వచ్చాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ చర్య వల్ల ఏర్పడిన పరిస్థితి.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలు 8 వేల కోట్లు పైగా ఉన్నప్పటికీ, రెండేళ్లుగా ఒక్క పైసా కూడా విడుదల చేయడం లేదు.ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకపోవడం వలన ప్రైవేట్ కాలేజీలు ప్రొఫెసర్లు, లెక్చరర్స్, టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వం గత ఆరు నెలలుగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతూ “మేమ త్వరలో పరిష్కారం చేస్తాం” అని చెప్పినా, ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం లేదా పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదు.గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డులు ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఈ వాగ్దానం ఇప్పటి వరకు అమలుకావడం లేదని విమర్శించారు..విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీదే ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మరింత కూలిపోయే పరిస్థితికి లోనవుతోంది.ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రూ. 1000 కోట్లు నిధులు ఇస్తామని వాగ్దానం చేశారు. కాని రాష్ట్రంలో పరిస్థితి రిటైర్డ్ టీచర్లకు పెన్షన్లు కూడా ఇవ్వని పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు.. భారతీయ జనతా పార్టీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మద్దతు పలుకుతోంది.కొత్త యూనివర్సిటీలకు కనీసం భవన నిర్మాణాలు చేయకపోవడం సబబుకాదు. ఇప్పటికైనా అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.భారతీయ జనతా పార్టీ ఈ నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా ఖండిస్తోంది.విద్యా వ్యవస్థను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయల్ని వెంటనే విడుదల చేయాలని, కొత్త భవనాల నిర్మాణం వేగవంతం చేయాలని రామ చందర్ రావు డిమాండ్ చేసారు.

 

Related News

Select the Topic
Scroll to Top