EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకు వద్దు.. స్కాలర్ షిప్స్ ఫీజు బకాయిలు చెల్లించాలి తెలుగు సంక్షేమ భవన్ ను ముట్టడించిన బిసి విద్యార్ధి సంఘం

హైదరాబాద్ ఆగష్టు 28 (ఈ తరం భారతం);రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజుల బకాయిలు 6000 కోట్లు వెంటనే చెల్లించాలని 100 బిసి కాలేజీ హాస్టలు మంజూరు చేయాలనీ, 119 బి.సి గురుకులాలు మంజూరు చేయాలనీ, బి.సి. గురుకుల పాటశాలలో 20 శాతం సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్ధి sangham రాష్ట్ర అద్యక్షులు వేముల రామ కృష్ణ నేతృత్వం లో వేలాది మంది విద్యార్థులు హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ వద్ద తెలుగు సంక్షేమ భవన్ ముట్టదించారు.. గుంపులు గుంపులుగా విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు, పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు.ఈ ముట్టడికి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి ఆర్. కృష్ణయ్య ప్రసంగిస్తూ- ఏంటో ముఖ్యమైన స్కాలర్ షిప్ , ఫీజు బకాయిలు, స్కీమును ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఈ స్కీము పెట్టిన తర్వాత గ్రామాల్లో వ్యవసాయ కూలీల పిల్లలు, మెడిసన్, ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీలు చదువుతున్నారు, సమాజంలో గుణాత్మకమైన మార్పు ప్రారంభమైంది చైల్డ్ లేబర్, అరికట్టబడింది, ప్రతి ఒక్కరు ఉన్నత విద్యా చదువుకుంటున్నారు ఈ గుణాత్మకమైన మార్పును ఆహ్వానించేది పోయి చదువు కోకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.ఈ ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనితో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. విదేశాలకు చదువుకోవడానికి సీట్లు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు లేక వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇక కాలేజీ యాజమాన్యాలు కష్టాలు కూడా చెప్పతరం కాదు అద్దె భవనాల అద్దె కట్టడం లేదు. కాలేజీ లెక్చరర్ల జీతాలు నెలల తరబడి ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు లెక్చరర్లు, జీతాలు రాక కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు.అలాగే ప్రస్తుతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో సీట్లు లభించక తెలుగు సంక్షేమ భవన్ చుట్టూ రోజుల తరబడి ప్రజలు తిరుగుతున్నారు సంబంధిత అధికారులు పట్టించుకోలేకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. వసతి సౌకర్యం ఉన్నచోట అదనపు సెక్షన్లు ప్రారంభించాలని అలాగే ప్రతి క్లాసులో 20% సీట్లు అదనంగా పెంచాలని కోరారు.ఇక బీసీ కాలేజీ హాస్టల్ లో సీట్లు దొరకగా విద్యార్థులు రైల్వేస్టేషన్లో, బస్టాండ్లలో, స్నానాలు చేస్తూ రాత్రి పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అందుకుగాను కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టల్లు మంజూరు చేయాలని ప్రస్తుతం ఉన్న 20% సీట్లు పెంచాలని కోరారు.ఈ ముట్టడిలో కార్యక్రమంలో బిసి విద్యార్ధి సంఘం రంగ రెడ్డి జిల్లా అద్యక్షులు చంద్ర శేఖర్ గౌడ్, రాజు నేత,నిఖిల్, యస్.రవి కుమార్ యాదవ్, రవి గుజ్జ కృష్ణ, నంద గోపాల్, సుదాకర్ ముదిరాజ్,లతో పాటు అనేకమంది విద్యార్ధులు పెద్దఎత్తున పాల్గొన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top