ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 1 : ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన అతి పెద్ద బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ను, అధికారులను అభినందించారు. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక అతిపెద్ద బతుకమ్మగా, అతిపెద్ద జానపద సంప్రదాయ నృత్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకుంది.ఈ నేపథ్యంలో మంత్రి , పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.















