EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బిసి జేఏసి రాష్ట్ర బంద్ విజయవంతం 

హైదరాబాద్ అక్టోబర్ 18 (ఈతరం భారతం) : బీసీ జేఏసి ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ ప్రశాతంగా ముగిసింది. ఈ మేరకు బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య బైక్ పై, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గంగిరెద్దులతో వినూత్న నిరసన తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ రోజు బంధు సంపూర్ణ విజయవంతంగా ముగిసిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామ, జిల్లాలలో బంద్ ప్రశాంతంగా ముగిసిందన్నారు.బిసి బంద్ కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్స్, కాలేజ్ లు, ఆర్టీసీ ఉద్యోగులు,135 కుల సంఘాలు, ప్రతి ఒక్కరూ బిసి బంద్ లో పాల్గొన్నారు. బీసీలకు వాటా దక్కాలని, న్యాయం చేయాలని బలమైన సంకేతాలు ఇచ్చారు.బిసిల ఆకాంక్షల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరావాలి.ప్రజలకు, వ్యాపారస్తులకు ఇబ్బందులు కలిగినవి వారికి కృతజ్ఞతలు పేర్కొన్నారు.76 సంవత్సరాల నుండి తమ వాటాలో మోసం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కొట్లాడితే స్థానికంగా మా కోట మేము సాదించుకుంటాము.భవిష్యత్ లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్న బిసి జాక్ నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాము.తెలంగాణ ఉద్యమం లాగా, సాగర హారమ్, మిలియన్ మార్చ్ లాంటి కార్యకమాలు తీసుకొని తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. చట్ట సభలలో తమ రిజర్వేషన్లు సాధించేవరకు, తెగించి పోరాడుతా మని తేల్చి చెప్పారు.ఈ రోజు జరిగిన బిసిల బంధు చరిత్రలో నిలుస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్ విజిఆర్ నారగోని, కో చైర్మన్ దాసు సురేష్, బీసీ జేఏసీ మీడియా కన్వినర్ గుజ్జ కృష్ణ, బీసీ సంఘం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామకోటి,లతో పాటు వివిధ సంఘాల బీసీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top