హైదరాబాద్ సెప్టెంబర్ 1 (ఈతరం భారతం);ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు బీసీ కమిషన్ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్ సభ్యుడిగా, అనంతరం రెండోసారి హయాంలో బీసీ కమిషన్ చైర్మన్గా సేవలందించిన డా. వకుళాభరణం కృష్ణమోహన్ .. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రాంచందర్ రావు , రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వకుళాభరణం కృష్ణమోహన్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ డా. వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.తెలంగాణ రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యువత, మేధావులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరుతున్నారు.వకుళాభరణం కృష్ణమోహన్ బీసీ కమిషన్కు మూడుసార్లు సభ్యుడిగా, ఒకసారి చైర్మన్గా పనిచేసి ఇప్పుడు బీజేపీలో చేరారు.డా. వకుళాభరణం కృష్ణమోహన్ ఉన్నత విద్యావంతుడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఎంబీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేసిన తాడూరి శ్రీనివాస్ కూడా ఇప్పటికే బీజేపీలో చేరారు. ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ చేరారు.ఇది తెలంగాణలో స్పష్టమైన సంకేతం – బీసీలు, ఎంబీసీలు అందరూ బీజేపీతో ఉన్నారు. బీసీల హక్కులను రక్షించేది బీజేపీ మాత్రమేనన్నారు.















