హైద్రాబాద్ సెప్టెంబర్ 7 (ఈ తరం భారతం)బీసీల కోసం పోరాటం చేస్తున్న జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసే పోరాటం అలుపెరుగని పోరాటమని ఎన్ని అడ్డంకులు వచ్చినా పట్టు విడవకుండా గత 19 నెలలుగా బీసీల కోసం 42 శాతం రిజర్వేషన్ అదే విధంగా పూలే విగ్రహం కుల గణన ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా వెను తిరగకుండా పోరాటం చేస్తూ బీసీ లకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షతో ఆమె చేస్తున్న పోరాటం మరువలేనిది . తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం.అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర MBC DNT. సంగం . తెలంగాణ వాణిజ్య వర్ధక సంఘ రాష్ట్రకన్వీనర్ కోలా శ్రీనివాస్ అన్నారు. గత 30 సంవత్సరాలుగా బీసీల కోసం పోరాటం చేస్తున్న నేను బీసీలకు రాజ్యాధికారం ఇంతవరకు రాలేదు. మా ఎంబిసి సంచార జాతుల కోసం ఇంతవరకు ఎవరు కూడా అసెంబ్లీ శాసన మండలిలో మాకు న్యాయం కలిగే విధంగా ఎవరూ మాట్లాడలేరు కానీ కల్వకుంట్ల కవిత సంచార జాతులకు DNT సర్టిఫికెట్లు ఇవ్వాలని శాసనమండలిలో మాట్లాడిన మాటలు నిజంగా మా జీవితాలకు ఒకవెలుగునిస్తుందని ఆశాభావంతో కచ్చితంగా మాలాంటి సంచార జాతుల ఎంబీసీలకు BC లకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయంగా కవిత చేసే పోరాటానికి పూర్తిగా మద్దతిస్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా మేధావులు కుల సంఘ నాయకులు రాజకీయంగా నాయకులు మీ వెంట మేమున్నామని రావటం నిజంగా సంతోషకరామన్నారు. సామాజిక తెలంగాణ బహుజన తెలంగాణ గా భావించి మేము జాగృతి సంస్థ లో చేరడం జరిగిందని టిలిపారు. మమ్మల్ని గుర్తించి ఉన్నత స్థానం కల్పించినందుకు కవితక్కకి కోలా శ్రీనివాస్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు















