EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బొల్లిగూడెం బస్తీలో ఘనంగా ఆర్ ఎస్ ఎస్ విజయదశమి ఉత్సవాలు

హైదరాబాద్ సెప్టెంబర్ 29 (ఈతరంభరతం );రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) బోడుప్పల్ మునిసిపాలిటి పరిధి లోని చెంగిచెర్ల నగరంలోని బొల్లిగూడెం బస్తీ పరిధిలోని లక్ష్మారెడ్డి కాలనీలో ఛత్రపతి శివాజీ శాఖ ఆధ్వర్యంలో, సంఘం స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, విజయదశమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.. ఈ కార్యక్రమంలో 22 మంది మహిళలు, బాలికలు మరియు 75 మంది పురుషులు పాల్గొనడం విశేషం. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా మోతీలాల్ (డిప్యూటీ స్థపతి, వైటీడీఏ), ముఖ్య వక్తగా పి. రాము యాదవ్ (ఉప్పల్ భాగ్ ఐటీ మిలన్ ప్రముఖ్) హాజరయ్యారు. అలాగే చెంగిచెర్ల నగర సంఘచాలక్ శ్రీ శివతేజ , లక్ష్మారెడ్డి కాలనీ అధ్యక్షుడు మల్లారెడ్డి ,సూరజ్ నగర్ కాలని చేర్మెన్ డాక్టర్ మహేశుని లక్ష్మయ్య నేత, చంగిచర్ల సంఘ్ చాల్ శివ తేజ, బొల్లిగూడెం బస్తీ ప్రముఖ్ రుకుం కుమార్ కాలనీ ప్రముఖులు పాల్గొన్నారు.ఈసందర్బంగా పి. రాము యాదవ్ మాట్లాడుతూ విజయదశమి ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ఇది సంప్రదాయ విలువలను కాపాడటమే కాక సమాజంలో ధైర్యం, సంకల్పబలం పెంపొందించడంలో కీలకమని పేర్కొన్నారు. అలాగే సంఘం నిర్దేశించిన పంచ పరివర్తన — సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ జాగరణ, పౌర బాధ్యతలు గురించి విశదీకరించారు.సంఘం ప్రారంభమైనప్పటి నుండి సమాజ పరివర్తన కోసం చేస్తున్న కృషిని గుర్తు చేస్తూ, ఈ 100వ వార్షికోత్సవ వేడుకలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయని ఆయన అన్నారు. సమాజంలో స్థిరమైన మార్పు కోసం ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ విజయదశమి ఉత్సవం సంఘం శతాబ్ది ఉత్సవాలలో ఒక మైలురాయిగా నిలిచి, సమాజంలో ఐక్యత, చైతన్యం మరియు సాంస్కృతిక పరిరక్షణకు తోడ్పదుతున్దన్నారు.

Related News

Select the Topic
Scroll to Top