హైదరాబాద్ సెప్టెంబర్ 24 (ఈతరం భారతం);కిక్ బాక్సింగ్ పేరిటనకిలీ సంఘాలు ఇచ్చే బోగస్ సర్టిఫికెట్లు తో క్రీడాకారులకు నష్టం కలిగించవద్దని తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.ఈరోజు తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం మహిపాల్ కోశాధికారి పి శ్రీనివాస్ లు మాట్లాడుతూ, తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, మరియు తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ గుర్తింపు ఇచ్చిన ఏకైక సంఘం అని, జాతీయ కిక్ బాక్సింగ్ సంస్థ వాకో ఇండియా కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ను యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం గుర్తించిందని తెలిపారుతెలంగాణ రాష్ట్రంలో అన్ని అధికారిక గుర్తింపులు ఉన్న ఏకైక సంస్థ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ 2017లో స్థాపించబడి అప్పటినుండి దాని పరిధిని దినదినం విస్తరిస్తూ దాదాపు 25 జిల్లాల్లో పటిష్టమైన సభ్యత్వం నాయకత్వం ఉందని వారు తెలిపారు.ఉండగా కొంతమంది అనధికారికంగా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ పేరిట చెల్లుబాటు కానీ రిజిస్ట్రేషన్ లతో క్రీడాకారులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని దీని నుండి కిక్ బాక్సింగ్ క్రీడాకారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వారు నిర్వహించే పోటీలకు వారు ఇచ్చే సర్టిఫికెట్లకు ఎటువంటి గుర్తింపు లభించదని వారు తెలిపారు. కాబట్టి బోగస్ సంఘాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కిక్ బాక్సింగ్ క్రీడా పట్ల వారికి అభిమానం ఉంటే తమతో కలిసి పని చేయాలని అంతేకానీ చెల్లుబాటు కానీ సంఘాలు పెట్టి క్రీడాకారుల మోసం చేయడం తగదన్నారు. అధికారికంగా అన్ని గుర్తింపులు ఉన్న తమ సంఘం కు సహకరించాలని క్రీడాకారులకు వారి తల్లిదండ్రులకు క్రీడా అధికారులకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పలువురు పాల్గొన్నారు.















