EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మంచు లక్ష్మీ ఇష్యూ పై నటి హేమ కామెంట్స్

ఈ తరం భారతం హైదరాబాద్, సెప్టెంబర్ 20 : టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఇష్యూ పై సహ నటి హేమ కామెంట్స్ చేశారు. సినిమా వాళ్లు లోకువయ్యారా అంటూ ఆమె విరుచుకుపడ్డారు. మంచు లక్ష్మీని ఒకరు బాడీ షేమింగ్ చేస్తుంటే ఎవరూ ఖండించలేదని హేమ విమర్శించారు. ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సొంత సిస్టర్ కే ఇలాంటి పరిస్దితి వస్తే.. మిగతా చిన్న ఆర్టిస్ట్ ల పరిస్దితి ఏంటని ఆమె నిలదీశారు. గతంలో నాపై కూడా అబద్దాలు ప్రచారం చేశారని.. దాని వల్ల తన ‘మా’ మెంబర్షిప్ తొలగించారని.. అతి కష్టం మీద తాను తిరిగి ‘మా’ అసోసియేషన్ లోకి వచ్చానని హేమ గుర్తుచేసుకున్నారు. యాంకర్ సుమపై కూడా కామెంట్స్ చేశారు.. ‘మా’ అసోషియన్ , ఫిలిం ఛాంబర్ కూడా మంచు లక్ష్మీ విషయంలో రెస్పాండ్ అవ్వాలని కోరుతున్నానని హేమ డిమాండ్ చేశారు.

ఇలాఉండగా, తనను ఒక సీనియర్ జర్నలిస్ట్ బాడీ షేమింగ్ చేశాడని, అతడిపై యాక్షన్ తీసుకోవాలని మంచులక్ష్మి ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఆమె నటించిన దక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూకు వెళ్లిన ఆమెను సదురు జర్నలిస్ట్.. మీరు 50 ఏళ్ళ వయస్సులో చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫోటోలు పెట్టేముందు ఎలాంటి కామెంట్స్ వస్తాయి అని అనుకొనే పెడతారా అని అడిగాడు. ఇది మంచులక్ష్మికి తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

ఇక సదు జర్నలిస్ట్ ప్రశ్నకు మంచు లక్ష్మీ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. ఇదే ప్రశ్న మహేష్ బాబును అడగగలరా.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. మీరే జనాలకు నేర్పిస్తున్నారు అంటూ ఫైర్ అయ్యింది. అక్కడితో ఆ వివాదం ముగిసింది అనుకుంటే.. మంచు లక్ష్మి నిన్న.. ఆ జర్నలిస్ట్ పై ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసింది. తనను సదురు జర్నలిస్ట్ బాడీ షేమింగ్ చేశాడని తెలుపుతూ.. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఇప్పటివరకు ఫిల్మ్ ఛాంబర్ జర్నలిస్ట్ పై యాక్షన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఇక ఈ వివాదంపై నటి హేమ ఫైర్ అయ్యింది. మంచు లక్ష్మీకి మద్దతు పలుకుతూ మంచు విష్ణును స్పందించాల్సిందిగా కోరింది..

Related News

Select the Topic
Scroll to Top