EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మరణించిన వ్యక్తుల బ్యాంక్ ఖాతాల సత్వర సెటిల్మెంట్ గైడ్

ఈ తరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 27 శనివారం :

మరణించిన వ్యక్తుల బ్యాంక్ ఖాతాల సత్వర సెటిల్మెంట్ గైడ్ :

మరణించిన ఖాతాదారుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లు, వాటిలోని వస్తువులను నామినీలకు అప్పగించే సెటిల్మెంట్ ప్రక్రియను RBI సులభతరం చేసింది . కొత్త మార్గదర్శకాలు వచ్చే ఏడాది మార్చి 31లోగా అమలు చేయాలని RBI కోరింది . చనిపోయిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలోని మొత్తం నామినీకి, జాయింట్ ఖాతా అయితే సర్వైవర్కు చెల్లించాలి .ఎవరో నామినీగా పేర్కొనకపోయినా, డిపాజిట్ మొత్తం నిర్ణీత పరిమితికి లోబడి ఉంటే, బ్యాంకులు సులభతర పద్దతిలో సెటిల్ చేయాలి. సహకార బ్యాంకులు: రూ.5 లక్షల వరకు; ఇతర బ్యాంకులు: రూ.15 లక్షల వరకు గరిష్ఠ పరిమితి .బ్యాంకుల బోర్డు అనుమతిస్తే, గరిష్ఠానికి మించిన మొత్తాన్ని కూడా సెటిల్ చేయవచ్చు . ఇందుకు వారసత్వం సర్టిఫికెట్లు లేదా చట్టబద్ద వారసుడే సర్టిఫికెట్లు అవసరం . చనిపోయిన ఖాతాదారుల నామినీలు, వారసుల నుంచి క్లెయిమ్ అందిన 15 రోజుల్లో సెటిల్మెంట్ పూర్తి చేయాలి . 15 రోజుల్లో సెటిల్ చేయలేకపోతే కారణాలు నామినీ, చట్టబద్ద వారసులకు తెలియజేయాలి . సహేతుక కారణం లేకుండా ఆలస్యం చేస్తే, ఖాతాలోని మిగులుపై వడ్డీకి తోడు 4% వార్షిక వడ్డీ చెల్లించాలి. లాకర్‌లోని వస్తువుల అప్పగింతలో ఆలస్యమైతే రోజుకు రూ.500 జరిమానా చెల్లించాలి .

Related News

Select the Topic
Scroll to Top