హైదరాబాద్ సెప్టెంబర్ 17 (ఈతరం భారతం);సమాజంలో నేడు అనాధలకు ఆర్తులకు నేనున్నా అనే భరోసా ఇచ్చేవారు అరుదు.ఇలాంటి తరుణంలో కాచిగూడ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన కాంటెస్ట్ కార్పొరేటర్ అయిన డాక్టర్ బత్తుల ఓం ప్రకాష్ శిరీష దంపతులు డయాలసిస్ తో బాధపడుతున్న ఒక సీనియర్ పాత్రికేయుడైన అవినాష్ విషయం తెలుసుకున్న వారు తమకు తోచిన సాయం సహకారాలు అందిస్తూ మేమున్నాము నీకు అన్న బరోసా కల్పించారు. పాత్రికేయులంటేనే పట్టించుకోని నేటి సమాజంలొ ఒక పేద పాత్రికేయుడిని గుర్తించి సహాయ సహాకారాలు అందిస్తూ పాత్రి కుటుంబానికి ఆదుకోవడాన్ని పలువురు అందిస్తున్నారు. వీరిసహాయానికి వెలకట్టదని చెప్పవచ్చు వీరికి ఏమిచ్చి నా ఋణం తీర్చుకోలేనిదని అవినాష్ కుటుంబం కంట తడి పెట్టింది. వృత్తిరిత్యా శిరీష డాక్టర్ అయి ఉండి ప్రతి ఒక్క సమస్యను వారి సమస్యగా భావించి చేరదీర్చడం ఆ భగవంతుడి ఆమెకు ఇచ్చిన వరం అని చెప్పవచ్చు.















